చిత్తూరు: సోలార్ ప్లాంట్ల టెండర్లకు ఆమోదం..! జిల్లాలో సోలార్ ప్లాంట్ల టెండర్లు ఖరారయ్యాయి. ఎస్ పి డి సి ఎల్ ఎస్ ఈ ఇస్మాయిల్ అహ్మద్ పర్యవేక్షణలో కుప్పం, చిత్తూరు డివిజన్లో ప్లాంట్ పనులు 2026 MAR. ఆఖరుకల్లా పూర్తవుతాయని అధికారులు తెలిపారు. ఈ ప్లాంట్ల ఏర్పాటుతో రైతులకు పగలే నిరంతరాయంగా 9 గం. విద్యుత్ సరఫరా అందనుంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక యూనిట్ విద్యుత్ కొనుగోలుకు రూ.6.50 ఖర్చు కానుండగా సోలార్ విద్యుత్‌తో ఆ ధర రూ.3.20కు దిగి రానుంది.