లక్ష్మాపురం గ్రామంలో వర్షానికి కూలిన మట్టి మిద్దె : లక్ష రూపాయల ఆస్తి నష్టం
నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి పగిడ్యాల మండల పరిధిలోని లక్ష్మాపురం గ్రామంలో శుక్రవారం కుమ్మరి కృష్ణ కు చెందిన మట్టి మిద్దె దెంతెలు విరిగి కూలిపోయింది, ఈ ఘటనలో బియ్యం కందిబేలు జొన్నలు నిత్యవసర వస్తువులు కలిపి దాదాపు లక్ష రూపాయలు నష్టం వాటినట్లు బాధితుడు తెలిపారు, ప్రమాద సమయంలో కుటుంబ సభ్యులు ఆరుబయట వారపాకుల ఉన్నందున ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు, ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు.