కలికిరి మండలం కలికిరి పట్టణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో పై శనివారం అవగాహన ర్యాలీ మానవహారం చేపట్టారు. ఈ ర్యాలీ డిప్యూటీ ఎంపీడీవో మహమ్మద్ రియాజుద్దీన్ ఆధ్వర్యంలో కలికిరి గ్రామ పంచాయతీ ఈఓ అశోక్ తమ సిబ్బందితో పాటు, నాలుగు సచివాలయాల సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులతో కలిసి వ్యక్తిగత పరిశుభ్రత పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. అనంతరం మానవహారం నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు.