కందికుంట నారాయణమ్మ నగర్ లో నిలిపివేసిన ఓవర్ హెడ్ ట్యాంక్ పూర్తి చేయాలని సిపిఎం నిరసన
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలోని కందికుంట నారాయణమ్మ నగర్ లో నిలిపివేసిన వాటర్ హెడ్ ట్యాంక్ నిర్మాణ పనులను పూర్తిచేయాలని ఆదివారం కాలనీలో సిపిఎం పార్టీ నాయకులు నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా కాలనీలో అనేక సమస్యలు నెలకొని ఉన్నాయని, దాదాపుగా 1000 కుటుంబాలు ఈ ప్రాంతంలో నివసిస్తున్నాయని, వారికి తగ్గట్టుగా నిలిపివేసిన ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని వారు కోరారు.