వర్షాల నేపథ్యంలో అధికారులు అందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలి: కమిషనర్ మౌర్య
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో వర్షాలు కురుస్తున్న తరుణంలో నగరంలోని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వెంటనే సాయం అందించేందుకు అన్ని విభాగాల అధికారులు అందుబాటులో అప్రమత్తంగా ఉండాలని నగరపాలక సంస్థ కమిషనర్ జాయింట్ కలెక్టర్ మౌర్య నగరపాలక సంస్థ అధికారుల ఆదేశించారు వర్షాలు నేపథ్యంలో నగరంలోని అండర్ బెడ్లలో పాటు మధుర నగర్ తదితర ప్రాంతాలను నగరపాలక సంస్థ అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు.