కళ్యాణదుర్గం: ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టకు ఎమ్మెల్యే సురేంద్రబాబును ఆహ్వానించిన గ్రామస్తులు నాగిరెడ్డిపల్లి గ్రామస్తులు
బ్రహ్మసముద్రం మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆంజనేయ స్వామి ఆలయంలో ఈనెల 26న విగ్రహ ప్రతిష్ట, కలశ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాలకు హాజరుకావాలని కళ్యాణ దుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబుకు గ్రామస్తులు ఆహ్వానించారు. నాగిరెడ్డిపల్లి ఆంజనేయస్వామి ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు గురువారం కళ్యాణదుర్గం వెళ్లారు. ఎమ్మెల్యేను కలిసి ఆహ్వానించారు. తప్పకుండా వస్తానని ఎమ్మెల్యే చెప్పారు.