సత్య సాయి శతజయంతిని విజయవంతం చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం: మంత్రి సవిత
సత్యసాయి శత జయంతి ఉత్సవాలను విజయవంతం చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని రాష్ట్ర పండుగగా నిర్వహించే ఈ జయంతి వేడుకలకు తరలివచ్చే భక్తులకు ఎటువంటి లోటుపాట్లు రాకుండా అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేందుకు సత్యసాయి ట్రస్ట్ సహకారంతో ప్రభుత్వం నిర్విరామంగా కృషి చేస్తుందని మంత్రి సవిత పేర్కొన్నారు. పది రోజులు పాటు జరిగే జయంతి వేడుకలకు దేశ విదేశాల నుంచి తరలివచ్చే భక్తులే కాకుండా ప్రధాని రాష్ట్రపతి పలు రాష్ట్రాల గవర్నర్లు తరలి రానున్న నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశంపై ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు.