ముంపు బాధితులకు అండగా ఎస్ఎఫ్ఎస్ఐ కేవీబీ పురం మండలం పాతపాలెం వద్ద గల ఓలూరు పెద్ద రాయల చెరువుకు గండి పడి ముంపునకు గురైన ప్రజలకు అండగా ఎస్వీ యూనివర్సిటీ ఎస్ఎఫ్ఎస్ఐ బృందం కలిసి శనివారం సహాయక చర్యలు చేపట్టింది. నిరాశ, బాధలో ఉన్న ప్రజానీకానికి ధైర్యం చెప్పుతూ వరద ప్రవాహానికి ఇళ్లలో పేరుకుపోయిన మట్టిని తొలగించారు. ఇళ్లలో బురదలో కూరుకుపోయిన వస్తువులను వెలికి తీశారు. విద్యార్థుల సర్టిఫికెట్స్ కొట్టుకు పోయాయని తెలిపారు.