గంగాధర నెల్లూరు: కార్వేటినగరం మండలం టీకేంపేటలో విద్యుత్ కేబుల్ వైర్లు చోరీ
కార్వేటినగరం మండలం టీకేంపేట గ్రామం సమీపంలోని 5 మంది రైతుల పొలాల వద్ద ఉన్న బోరు బావుల కేబుల్ వైర్లను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. గ్రామానికి చెందిన రైతులు వాసు, గున్నయ్య, మోహన్, బుజ్జీ రైతుల 400 మీటర్ల కేబుల్ వైరు చోరీ జరిగినట్లు బాధితులు సోమవారం వాపోయారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు.