కుప్పం: CJI గవాయ్‌పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి
CJI గవాయ్‌పై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ నేతలు డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు కుప్పం ఎమ్మార్పీఎస్ నాయకులు రాజ్ కుమార్, మురుగేష్ ఆధ్వర్యంలో తహశీల్దార్ చిట్టిబాబుకు వినతిపత్రం అందజేశారు. CJIపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ వారు డిమాండ్ చేశారు.