ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని గడియారం సెంటర్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసన తెలియజేశారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రంగారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్స్ కోడ్ అమలు చేయాలని నిర్ణయించడానికి వ్యతిరేకిస్తున్నామన్నారు. కార్మిక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనట్లు పేర్కొన్నారు.