పులివెందుల: ఏపీసీసీ అధ్యక్షురాలను మర్యాదపూర్వకంగా కలిసిన పులివెందుల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ధ్రువ కుమార్ రెడ్డి
Pulivendla, YSR | Sep 21, 2025 హైదరాబాదులోని లోటస్ పాండ్ లో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డిని పులివెందుల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మూలం రెడ్డి ద్రవకుమార్ రెడ్డి ఆదివారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పులివెందులలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు అందరూ ఐక్యంగా పనిచేయాలని పిసిసి చీఫ్ షర్మిల రెడ్డి సూచించినట్లు చెప్పారు అలాగే పులివెందుల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై ద్రవకుమార్ రెడ్డితో షర్మిల రెడ్డి చర్చించారు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తీసుకొని వెళ్లాలని చెప్పినట్లు పేర్కొన్నారు.