అదిలాబాద్ అర్బన్: దారి లేక.. కుచులాపూర్ గ్రామ రైతుల పొలాల్లోకి వెళ్లి పనులు చేసుకోవడానికి ఇబ్బందులు #Localissue
తలమడుగు మండలం కుచులాపూర్ గ్రామ రైతుల పొలాల్లోకి వెళ్లి పనులు చేసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు,దాదాపు 1500 నుండి 2000 ఎకరాలు గ్రామస్తుల పొలాలు.ఈ దారి గుండా నే వెళ్లాలి,పంటలకు ఎరువులు,పిచికారి మందులు చల్లాలన్న, పండిన పంట తీసుకురావాలన్న ఎడ్ల బండిపై ప్రయాణం నరకంలా అనిపిస్తుందని , వర్షాకాలం వచ్చిందంటే పూర్తిగా బురద మయం గుంతలమయంతో దారి పొడవునా ఎక్కడ ప్రమాదం జరుగుతుందో అని భయం భయంగా వెళుతున్నామని రైతులు వాపోతున్నారు,గత మూడు సంవత్సరాలుగా మండల అధికారులకు నాయకులకు విన్నవించిన దారి గురించి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరమని అన్నారు