పులివెందుల: ఇడుపులపాయలో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ సంతకాల సేకరణ
Pulivendla, YSR | Oct 30, 2025 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019-24వ సంవత్సరంలో నిర్మించిన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సిపి పార్టీ తలపెట్టిన "కోటి సంతకాల సేకరణ" కార్యక్రమం, గురువారం వేంపల్లి మండల పరిధిలోని ఇడుపులపాయ పంచాయితీ నందు గల గ్రామాలలో కన్నుల పండుగగా జరిగినది. గ్రామస్తులకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల జరిగే కష్టనష్టాలను కూలంకుశుంగా వివరించి, వారి సమ్మతితో సంతకాల సేకరణ చేయడం జరిగినది. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలపడం సంతోషదాయకం అన్నారు.