వాల్మీకిపురం ఎన్టీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డ్రగ్స్ మరియు గాంజా మహమ్మారి నుండి రక్షిద్దాం అనే కార్యక్రమం పై అవగాహన
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిలి ఐపీఎస్ మరియు రాయచోటి డి.ఎస్.పి ఎం.ఆర్ కృష్ణమోహన్ ఉత్తర్వుల మేరకు వాల్మీకిపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ బి.రాఘవ రెడ్డి మరియు ఎస్సై సి.చంద్రశేఖర్ మంగళవారం వాల్మీకిపురం ఎన్టీఆర్ డిగ్రీ కళాశాలలో శ్రీ శక్తి యాప్ గురించి మరియు రేపటి తరానికి డ్రగ్స్ మరియు గంజాయి మహమ్మారి నుండి రక్షిద్దాం అనే కార్యక్రమం పై అవగాహన సదస్సు నిర్వహించారు.సీఐ రాఘవ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళా రక్షణ, భద్రత కోసం స్త్రీ శక్తి యాప్ ను అందుబాటులోకి తెచ్చిందని అన్నారు. ఈ యాప్ వలన క్లిష్ట సమయాలలో మహిళలకు తక్షణ సహాయానికి రక్షణ కల్పించడానికి ఉపయోగపడుతుందన్నారు