చాటింగ్ చేయొద్దని చెప్పినందుకు యువతి ఇంట్లోంచి వెళ్లిన ఘటన నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. జైపురి కాలనీలో ఉండే నాగేశ్వరి రెండేళ్లుగా ఇంట్లోనే ఉంటుంది. ఈనెల 26న ఇన్స్టాల్ లో చాట్ చేస్తుండగా తల్లి ప్రశ్నించింది. అదే రోజు సాయంత్రం నాలుగున్నరకు నుంచి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఎక్కడ వెతికిన ఫలితం లేకపోవడంతో చాట్ చేసిన వ్యక్తిని అనుమానిస్తూ తల్లి శారద పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.