జాగృతి జనం బాటలో భాగంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో పర్యటించిన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, మాధవరం కృష్ణారావు చేసిన అవినీతి అక్రమాలపై ఆధారాలతో సమాధానం ఇస్తానని తెలిపారు. మాధవరం కృష్ణారావు చేసిన ఆరోపణలపై రెండు రోజుల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తానని, మాధవరం మాటల్లో ఫ్రస్టేషన్ కనిపిస్తుందని ఆయన 15 సంవత్సరాలుగా చేసిందే తాను చెప్పానని అన్నారు. మాధవరం కృష్ణారావు వ్యక్తిగత ఆరోపణలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని కవిత పేర్కొన్నారు