తాడిపత్రి: పెద్దవడుగూరులో తల్లి మందలించిందని కొడుకు ఆత్మహత్య, కేసు నమోదు చేసుకున్న పోలీసులు
అతిగా మద్యం తాగుతున్నాడని తల్లి కొడుకును మందలించడంతో మనస్తాపానికి గురై యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దవడుగూరు మండలంలో చోటుచేసుకుంది. చిట్టూరు గ్రామానికి చెందిన అనిల్ కుమార్ (24) పదేపదే మద్యం తాగుతున్నాడని తల్లి పెద్దక్క మందలించింది. రాత్రి ఇంటి నుంచి వెళ్లి పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా.. అనంతపురానికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.