కళ్యాణదుర్గం: ముప్పలకుంట గ్రామ శివారులో పేకాట స్థావరంపై పోలీసులు దాడులు, 6 మంది పేకాట రాయుళ్లు అరెస్ట్, నగదు స్వాధీనం యూ
బ్రహ్మసముద్రం మండల పరిధిలోని ముప్పల కుంట గ్రామ శివారులోని పేకాట స్థావరం పై బుధవారం పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్కడ పేకాట ఆడుతున్న ఆరు మందిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.36,020 నగదను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా పది బైకులు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు.