దివ్యాంగ విద్యార్థులకు 16వ తేదీ నుంచి 23వ తేదీ వరకు మెడికల్ అసెస్మెంట్ ఏపీసి వెంకటరమణ
Chittoor Urban, Chittoor | Sep 16, 2025
చిత్తూరు: రేపటి నుంచి వైద్య శిబిరాలు దివ్యాంగ విద్యార్థులకు ఈ నెల 16 నుంచి 23 వరకు మెడికల్ అసెస్మెంట్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటరమణ తెలిపారు. దివ్యాంగ విద్యార్థులు ఫొటో, ఆధార్, రేషన్ కార్డు, సదరన్ సర్టిఫికేట్స్ తో శిబిరానికి హాజరు కావాలన్నారు. కుప్పం, రామకుప్పం, శాంతిపురం, గుడిపల్లి మండలాలకు చెందిన వారికి కుప్పం బాయ్స్ హై స్కూల్లో బుధవారం క్యాంపు ఉంటుందని చెప్పారు.