ప్రకాశం జిల్లా కొండపి పొగాకు వేలం కేంద్రంలో క్లస్టర్ రైతులతో సోమవారం ఉత్పత్తి నియంత్రణ సమావేశం జరిగింది. కార్యక్రమంలో వేలం కేంద్ర నిర్వహణాధికారి సునీల్ మాట్లాడారు. 25-26 పంట కాలానికి పొగాకు బోర్డు అనుమతించిన విస్తీర్ణంలోనే పొగాకు సాగు చేయాలన్నారు. క్రమంగా పొగాకు సాగును తగ్గించి ఆర్థికంగా లాభదాయకమైన ప్రత్యేక పంటలకు మారాలని రైతులకు సూచించారు. పొగాకు నర్సరీ రిజిస్ట్రేషన్ల ఆవశ్యకతను వివరించారు.