నిర్మల్: లక్ష్మణచందా మండలం పీచర గ్రామంలో మత్స్య సొసైటీ ఏర్పాటు చేయాలని కలెక్టరేట్ ఎదుట ముదిరాజ్ కులస్తుల ఆందోళన
Nirmal, Nirmal | Sep 15, 2025 లక్ష్మణచందా మండలం పీచర గ్రామానికి చెందిన ముదిరాజ్ కులస్తులు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. గ్రామంలో సుమారు 100 ముదిరాజ్ కుటుంబాలు జీవిస్తున్నారని గ్రామంలో 5 చెరువులు ఉండగా గంగపుత్ర సామాజిక వర్గానికి చెందిన రెండు కుటుంబాలు మాత్రమే చెరువులో చేపలు పడుతున్నారని పేర్కొన్నారు. అధిక సంఖ్యలో ఉన్న ముదిరాజ్ కులస్తులకు చెరువులో చేపలు పట్టేందుకు వాటా కల్పించాలని అధికారులకు విన్నవించిన పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించగా చేపలు పట్టినందుకు ఆదేశాలు జారీ చేసిందని పేర్కొన్నారు. సొసైటీ ఏర్పాటు చేయాల్సి ఉండగా వీడీసీ సభ్యులు వ్యతిరేకిస్తూ ముదిరాజ్, గంగపుత్రులే కా