మారుతి నగర్ కాలనీ సమస్యలు పరిష్కరించాలని సిపిఎం ఆధ్వర్యంలో: తాసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా వినతి పత్రం
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని మారుతి నగర్ కాలనీ సమస్యలు పరిష్కరించకపోతే రిలే నిరాహార దీక్షలు చేపడతామని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం నాగేశ్వరావు హెచ్చరించారు,సోమవారం నందికొట్కూరు మున్సిపాలిటీ మారుతి నగర్ కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం మరియు మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం నాగేశ్వరావు సిపిఎం నాయకులు టి.గోపాలకృష్ణ, బేస్తరాజు, ఎస్ ఉస్మాన్ భాష మాట్లాడుతూ నందికొట్కూరు మున్సిపాలిటీలో మారుతి నగర్ కాలనీలో 2004 సంవత్సరంలో దాదాప