నేటి యువత సేవా కార్యక్రమాల్లో ముందుండాలి.. ఫ్రెండ్స్ బ్లడ్ గ్రూప్ ప్రతినిధి షాషావలి
బనగానపల్లె నియోజకవర్గం అవుకు మండలంలోని రామాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో 25 మంది యువకులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేయడం జరిగింది ఈ సందర్భంగా గ్రామ యువత మాట్లాడుతూ బనగానపల్లె ఫ్రెండ్స్ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను చూసి మేము కూడా వారిని ఆదర్శంగా తీసుకొని సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు