న్యూ రాజరాజేశ్వరి పేటలో డయేరియా కేసులు ఇంకా అదుపులోకి రాలేదు: సిపిఎం బాబురావు
విజయవాడ న్యూ రాజరాజేశ్వరి పేటలో డయేరియా కేసులు ఇంకా అదుపులోకి రాలేదని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాబురావు ఆరోపించారు. మంగళవారం విజయవాడ న్యూ రాజరాజేశ్వరి పేట పరిసర ప్రాంతాల్లో ఆయన పర్యటించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పదుల సంఖ్యలో ఇంకా బాధితులు వైద్యం చేయించుకుంటున్నారని, సీఎం చంద్రబాబు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిన్న మీటింగ్లో మాట్లాడారని అధికారులు డయేరియానే నియంత్రించే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు