బనగానపల్లెలో శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వచ్చిన వినతులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, పెన్షన్లు, ఉద్యోగాలు, ఉపాధి సమస్యలు అధికంగా రావడంతో అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి చర్యలు చేపట్టారు. రాంభూపాల్ నగర్లో తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని మంత్రి సూచించారు.