కళ్యాణదుర్గం: కుందుర్పి రెవెన్యూ కార్యాలయం వద్ద స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీని ప్రారంభించిన తహశీల్దార్ ఓబులేసు
కుందుర్పి రెవెన్యూ కార్యాలయం వద్ద సోమవారం తహశీల్దార్ ఓబులేసు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడారు. ఈరోజు నుంచి అన్ని ప్రభుత్వ రేషన్ దుకాణాల్లో స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేస్తామన్నారు. స్టోర్ డీలర్లు లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందన్నారు. రేషన్ కార్డు దారులు ప్రభుత్వ రేషన్ షాపులకు వెళ్లి స్మార్ట్ రేషన్ కార్డులను తీసుకోవాలన్నారు.