భువనగిరి: ర్యాగింగ్ కు పాలు పడితే చట్ట రిత్యా చర్యలు తప్పవు: చౌటుప్పల్ ఏసిపి మధుసూదన్ రెడ్డి
యాదాద్రి భువనగిరి జిల్లా: విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తప్పవని క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చౌటుప్పల్ ఏసిపి మధుసూదన్ రెడ్డి బుధవారం అన్నారు. బుధవారం భూదాన్ పోచంపల్లి మండల పరిదిలోని దేశ్ముఖి గ్రామంలో గల విజ్ఞాన్ యూనివర్సిటీలో యాంటీ ర్యాగింగ్ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సీనియర్ల ముసుగులో జూనియర్ విద్యార్థులపై ర్యాగింగ్ ఇవిటీజింగ్ పాల్పడవద్దని డ్రగ్స్ గంజాయి సిగరెట్ వంటి ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.