గంగాధర నెల్లూరు: బాధితులను ఆదుకుంటాము : జీడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్
ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతో నిరాశ్రయులైన ఓ కుటుంబాన్ని ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ఆదుకున్నారు. ఎల్లమ్మరాజు పల్లెకు చెందిన కుమారి అనే మహిళ పురిగుడిసె ఇటీవల కురిసిన వర్షాలకు కూలిపోయింది. దీంతో ఆమెకు నష్టం చేకూరింది. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే ఆమెకు ఆదివారం 50 వేల సాయం అందించారు. పక్కా ఇంటి మంజూరుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.