స్మార్ట్ కార్డులపై అంబేడ్కర్ పేరు ముద్రించాలి: ఈదరాడలో అంబేద్కర్ కోనసీమ జిల్లా సాధన సమితి వ్యవస్థాపకులు శ్రీనివాస్
స్మార్ట్ రేషన్ కార్డులపై వెంటనే అంబేడ్కర్ పేరు ముద్రించాలని అంబేడ్కర్ కోనసీమ జిల్లా సాధన సమితి వ్యవస్థాపకుడు నల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మామిడికుదురు మండలం ఈదరాడలో మంగళవారం ఆయన మాట్లాడారు. సాయంత్రంలోగా దీనిపై ప్రభుత్వం ప్రకటన చేయకపోతే తాను నగ్నంగా దీక్షకు దిగుతానని హెచ్చరించారు. దళితులు మరో పోరాటానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.