కణేకల్లు మండలంలోని 43 ఉడేగోళం గ్రామంలో రోడ్లకు ఇరువైపులా ఉన్న చెత్త, మట్టి,దిబ్బలను తొలగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సంక్రాంతి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో గ్రామాన్ని స్వచత గ్రామంగా తీర్చిదిద్దటానికి సర్పంచ్ లావణ్య, టిడిపి నేత మారుతిల ఆధ్వర్యంలో జెసిబి ఏర్పాటు చేసి శుక్రవారం వాటిని తొలగించారు. పంచాయతీ కార్యదర్శి, ఈఓ ఆర్డీ పాల్గొన్నారు. గ్రామంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయరాదని సూచించారు.