నల్గొండ: ఖాజీ రామారం గ్రామములో సీతాఫల చెరువు మత్తడి దూకుతుంది
నల్లగొండ జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు నల్లగొండ మండలం ఖాజీరామారం గ్రామములో సీతాఫల చెరువు మత్తడి దూకుతుంది. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కలెడ వరీడు యొక్క వరద కాలువల ద్వారా చెరువులోకి భారీగా వర్గ నీరు వచ్చి చేరింది. సోమవారం ఉదయం దీంతో చెరువు అలుగు ఉదృతంగా పారుతుంది .ఎగువ దిగువన ఉన్న పంట పొలాలు కొంతమేర నీటమునిగాయి. పంటలు నష్టపోతున్నామని రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు.