గంగాధర నెల్లూరు: ఎస్ఆర్ పురం మండలం మర్రిపల్లిలో శ్రీకృష్ణ భజన మందిర కుంభాభిషేకంలో పాల్గొన్న ఎమ్మెల్యే థామస్
ఎస్ఆర్ పురం మండలం మర్రిపల్లిలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీ కృష్ణ భజన మందిర కుంభాభిషేక మహోత్సవంలో శుక్రవారం జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వీఎం థామస్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వీరికి ఆలయ నిర్వహకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి స్వామివారి దర్శన భాగ్యం కల్పించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు జయశంకర్ నాయుడు, రాజశేఖర్ నాయుడు, మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.