విద్యారంగంలో ఆర్థిక రంగానికి కలిగిన మేలు ఏంటో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి:UTFరాష్ట్ర అధ్యక్షులు ఎన్. వెంకటేశ్వర్ల
Machilipatnam South, Krishna | Sep 16, 2025
ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి: యుటిఎఫ్ విద్యారంగంలో చేపట్టిన సంస్కరణల వల్ల విద్యార్థులకు, ఆర్థిక రంగానికి కలిగిన మేలు ఏమిటో వెంటనే శ్వేత పత్రం రూపంలో ప్రభుత్వం వెల్లడించాలంటూ యుటిఎఫ్ రాష్ట్రఅధ్యక్షులు ఎన్. వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. విద్యా, ఆర్థిక సమస్యలపై చేపట్టిన రణభేరి జిల్లా బైక్ ర్యాలీని మంగళవారం మద్యాహ్నం 4 గంటల సమయంలో స్తానిక గన్నవరంలో ఆయన ప్రారంభించారు. ప్రభుత్వం ఏర్పడి15 నెలలు గడిచినా విద్యారంగంలోని ఒక్క సమస్యకైనాచెప్పుకోదగ్గ పరిష్కారం చూపలేదని విమర్శించారు.