రాయదుర్గం: పట్టణంలో వార్డు సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు
రాయదుర్గం మండలం 32వ వార్డు పరిధిలో ఉన్న 18 వ సచివాలయాన్ని రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవశ్రీనివాసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. బుధవారం ఉదయం అకస్మాత్తుగా సచివాలయానికి ఎమ్మెల్యే చేరుకున్నారు. రికార్డులు పరిశీలించి ఉద్యోగులతో మాట్లాడారు. విధులకు సక్రమంగా హాజరు కావాలని, ప్రజా పిర్యాదులపై నిర్లక్ష్యం వహించకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని సూచించారు. కమీషనర్ దివాకర్ రెడ్డి ఆయన వెంట ఉన్నారు.