తాడిపత్రి: యాడికిలో వైసీపీ శ్రేణుల ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం ర్యాలీ
మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో బుధవారం యాడికి మండల కేంద్రంలో ప్రజా ఉద్యమం ర్యాలీ నిర్వహించారు. యాడికి మండలం తో పాటు పెద్దవడుగూరు,తాడిపత్రి, పెద్దపప్పూరు మండలాలకు చెందిన పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. వైసీపీ కార్యాలయం వద్ద నుంచి రెవెన్యూ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా జై జగన్, వైసీపీ వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు.పోలీసులు బందోబస్తు నిర్వహించారు.