శ్రీశైలంలో శివ స్వాములపై సోమవారం నాటి లాటిచార్జి జరిగిన ఘటనలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, శ్రీశైలంలో శివస్వాములపై లాటి చార్జి జరగడం దురదృష్టకరమని పోలీసులు కొంత నిగ్రహంగా ఉండవలసి ఉండేదని,బ్రహ్మోత్సవాల్లో అధికారులు అంచనా వేయలేకపోయారని, ఒకసారి భక్తులు రావడంతో ఈ తప్పిదం జరిగిందని, ఇకనుంచైనా మిగతా రోజులు బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలని అలాగే శివ స్వాములపై లాఠీ చర్జి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని మాధవ్ అన్నారు.