రాయదుర్గం: పుత్తూరులో అడ్వకేట్ పై జరిగిన దాడికి నిరసనగా పట్టణంలో కోర్టు విధులు బహిష్కరించిన న్యాయవాదులు
చిత్తూరు జిల్లాలోని పుత్తూరు కోర్టుకు వెళుతున్న న్యాయవాదిపై జరిగిన దాడి ఘటనకు నిరసనగా రాయదుర్గంలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. మంగళవారం ఉదయం పట్టణంలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు వద్ద దాడిని ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లేశప్ప, ప్రధాన కార్యదర్శి వన్నూరస్వామి, న్యాయవాదులు రవిచంద్ర, లోకానంద తదితరులు మాట్లాడుతూ న్యాయవాదుల రక్షణ చట్టం తేవాలని కోరారు.