కరీంనగర్: ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు నిర్వహిస్తున్న బంద్ కు SFI సంపూర్ణ మద్దతు : SFI కరీంనగర్ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్
తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు ఇచ్చిన సమ్మెకు SFI సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ ఒక ప్రకటన లో తెలిపారు. ఆదివారం విడుదల చేసిన వీడియో లో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు రావలసిన స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు 8వేల కోట్లు పెండింగ్ లో ఉన్నాయన్నారు. ఇన్ని సంవత్సరాలలో దేశంలో ఎక్కడా ఫీజు బకాయిల కోసం విద్యాసంస్థల యాజమాన్యం కళాశాలలు బంద్ చేసి రోడ్ల మీదికి వచ్చి ఆందోళన చేసే పరిస్థితి లేదన్నారు.