నాణ్యతే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఓ వ్యాపారి వినూత్న ఆలోచన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.సాధారణంగా పసుపు పొడి అంటే అనుమానాలే ఎక్కువగా ఉండే ఈ రోజుల్లో… కస్టమర్లకు పూర్తి నమ్మకం కలిగించే విధంగా అతను తన వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు.ఆటోలోనే పసుపు మిషన్ను ఏర్పాటు చేసుకొని, మండ పసుపును నేరుగా కస్టమర్ల ముందే జిన్ను పట్టి, నాణ్యమైన పసుపు పొడిని అందిస్తున్నాడు.కిలో పసుపు ధరను రూ.300గా నిర్ణయించి, ఎలాంటి కల్తీ లేకుండా స్వచ్ఛమైన పసుపును విక్రయిస్తున్నాడు.కస్టమర్లు తమ కళ్ల ముందే పసుపు పొడిగా మారడాన్ని చూసి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.