తాడిపత్రి: తాడిపత్రి పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించిన భక్తులు
తాడిపత్రిలో దసరా వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో అభిషేకాలు అర్చనలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. మూడవ రోజు శ్రీశైల భ్రమరాంబికాదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. ప్రత్యేక స్టోన్ రాళ్లతో ఏర్పాటు చేసిన అలంకరణ చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున వచ్చారు.