మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య పరమైన నష్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి, కలెక్టర్ ప్రసన్న వెంకటేష్
Eluru, Eluru | Mar 30, 2024 మాదక ద్రవ్యాల వినియోగం వల్ల ఎదుర్కొనే అనారోగ్య సమస్యలపై ప్రజలతోపాటు యువతకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు. శనివారం సాయంత్రం ఆరు గంటల సమయంలో స్ధానిక కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో నార్కో కో-ఆర్డినేషన్ సెంటర్ జిల్లాస్ధాయి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ అధ్యక్షతన జరిగింది. గంజాయి నియంత్రణ, డ్రగ్స్ అక్రమ రవాణా సంబంధిత శాఖలు తీసుకున్న చర్యలపై జిల్లా ఎస్పీ డి. మేరీప్రశాంతితో కలిసి జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ సమీక్షించారు.