స్వచ్ఛ సర్వేక్షన్ లో విద్యార్థులందరూ భాగస్వాములు కావాలి: కమిషనర్ ధ్యానచంద్ర
స్వచ్ఛ సర్వేక్షన్ లో విద్యార్థులు అందరూ భాగస్వాములు కావాలని విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర పేర్కొన్నారు. శనివారం విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో ఉన్న ఎంకే బేగ్ మున్సిపల్ హైస్కూల్లో స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు ప్రజలు అందరూ స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని మన పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటి పచ్చతనాన్ని పెంపొందించాలని సూచించారు.