శామీర్‌పేట: ప్రజలకు బాకీ పడ్డ మొత్తాన్ని కాంగ్రెస్ పార్టీ తక్షణం చెల్లించాలి: మేడ్చల్ లో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
ఎన్నికల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు డిమాండ్ చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ బాకీ కార్డు పేరుతో ఏర్పాటు చేసిన పోస్టర్లను ఆవిష్కరించారు.