కుప్పం: సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
కుప్పంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పంచాయతీ కార్యదర్శులు పాలాభిషేకం చేశారు. గ్రామపంచాయతీ క్లస్టర్ల విధానం రద్దు చేసి గ్రామ పంచాయతీలను స్వతంత్ర పరిపాలన యూనిట్లుగా చేయడానికి పునర్వ్యవస్థీకరణ ద్వారా గ్రేడ్ల కుదింపు, గ్రేడ్ల అప్డేషన్, ప్రమోషన్లు, అలాగే పంచాయతీ కార్య దర్శి పేరును పంచాయతీ అభివృద్ధి అధికారులుగా మార్చిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ పాలాభిషేకం చేశారు.