నారాయణపేట్: పేద ప్రజల సంక్షేమానికి కృషి చేస్తాం : ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి
మక్తల్ తాసిల్దార్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 163 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.