వనపర్తి: పెద్దమందడి: ఎన్నికల బూతులను పరిశీలించిన తహసిల్దార్ వెంకటేశ్వర్లు
రానున్న పార్లమెంట్ ఎన్నికల దృస్ట్యా పెద్దమందడి మండల పరిధిలోని ఎన్నికల బూతులను తహసీల్దార్ వెంకటేశ్వర్లు పరిశీలించారు. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు చిలకటోని పల్లి గ్రామ ఎన్నికల బూత్ ను ఆయన పరిశీలించారు.బూత్ వారిగా ఎన్ని ఓట్లు ఉన్నాయని బిఎల్ఓ లను వారు అడిగి తెలుసుకున్నారు.ఎన్నికల సమయంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా బిఎల్వో అధికారులు బాధ్యతలు తీసుకోవాలని వారు తెలిపారు.తప్పుగా ఉన్న ఓటర్ల జాబితాలను సవరించి పూర్తిచేయాలని బిఎల్ఓ లకు తెలిపారు.