గిద్దలూరు: కంభం మండలంలోని కంభం చెరువుకు వెళ్లే రహదారి తుఫాను కారణంగా దెబ్బ తినడంతో అవస్థలు పడుతున్న పర్యటకులు వాహనదారులు
ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని కంభం చెరువు వైపు వెళ్లే ప్రధాన రహదారి మొంథా తుఫాన్ కారణంగా గతంలో కురిసిన భారీ వర్షాలకు వాగు పారి రహదారి కోతకు గురి అయింది. అలాగే పక్కనే ఉన్నా చప్టా కూడా కృంగిపోవడంతో వాహరదారులు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం వందల సంఖ్యలో పర్యాటకు ఆ రహదారి నుంచి వెళ్తూ ఉంటారు. ఈ కోతకు గురైన రహదారిపై ప్రయాణించాలంటే ఇబ్బందులు పడుతున్నామని అధికారులు స్పందించి వెంటనే రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని పర్యటకులు కోరుతున్నారు.