జమ్మలమడుగు: జమ్మలమడుగు : శానిటేషన్, సెక్యూరిటీ గార్డ్స్ కు పెండింగ్లోని 3 నెలల వేతనాలు ఇవ్వాలి - ఆప్కాస్ గౌరవ అధ్యక్షులు
కడప జిల్లా జమ్మలమడుగు ప్రభుత్వ హాస్పిటల్లో మరియు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న శానిటేషన్ సిబ్బంది, సెక్యూరిటీ గార్డ్స్ కు పెండింగ్లో ఉన్న గత 3 నెలల వేతనాలు ఇవ్వాలని కోరుతూ సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో జమ్మలమడుగు ఆర్డిఓ కార్యాలయ ఏఓ ఇక్బాల్ భాషాకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆప్కాస్ గౌరవ అధ్యక్షులు వినయ్ కుమార్ మాట్లాడుతూ జూన్ నుంచి స్కూలు ఓపెన్ అయినాయని గుర్తు చేశారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పాఠశాలలో పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ గార్డులకు ఇంతవరకు వేతనాలు చెల్లించలేదని తెలిపారు.