గండబోయినపల్లి శ్రీ సత్యమ్మ తల్లి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు
వాల్మీకిపురం మండలం గండబోయినపల్లి కోటలో వెలసిన శ్రీ సత్యమ్మ తల్లి ఆలయములో నేటి నుంచి అక్టోబర్ 2వరకు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను ఆలయ కమిటీ చైర్మన్ పులి సత్యనారాయణ రెడ్డి మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ముక్కోటి దేవతలుకు ఆహ్వానం పలుకుతూ ఆదివారం ఉదయం అమ్మవారికి పంచామృత అభిషేకం కలశ స్థాపన నవగ్రహ పూజ వినాయక పూజతో పాటు కుంకుమార్చన మహా నివేదన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కమిటీ ఏర్పడిన మొదటిసారి గత ఏడాది దసరా పండుగను వైభవంగా నిర్వహించామని ఈసారి మరింత రెట్టింపు ఉత్సాహంతో నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపారు. తొమ్మిది రోజుల